In Love
వాస్తవం.. ప్రేమ ఊహలోకం చూపిస్తుంది. జీవితం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మనిషి మనసు ఆకాశానికి నిచ్చెన వేస్తుంది. జీవితం మనసుకి హద్దులు చూపిస్తుంది. మనసు ఆశల మెట్లు ఎక్కి అంబరాన్ని అందుకోవాలని చూస్తుంది. అదే వాస్తవం అని భ్రమ పడుతుంది. అందులోనే జీవించాలనుకుంటుంది. కానీ వాస్తవం కనుల ముందు తెరలు తొలగిస్తుంది. కనిపించని ఊహలను మనసు అందుకోవాలని చూస్తుంది. ఏది చూసినా ఆ చూపు నేలని చూస్తే బావుంటుంది.