English
Download App from store
author
aruna kumari
A school teacher with a view to see good in the society and people.
user
aruna kumari
ప్రవాహం
  83 Views
 
  1 Mins Read
 
  2

నేను నదిలా ప్రవహించే గెడ్డ .ఈ ఉళ్లో అందరు నన్ను ఆ పేరుతొ పిలుస్తారు , నేను పుట్టిన దగ్గరనుండి తరతరాలు నా ముందు ఎదుగుతూ అంతరిస్తూ చూస్తుంటాను . నా మనస్సుని ఆహ్లాద పరిచే ప్రతి ఉదయ సూర్యకాంతి ,పిల్లల కేరింతలు ,పెద్దల పనులు ,పశు పక్ష్యాదులు నాలో మునిగి తేలుతూ ....నన్ను, నా ఉనికిని ,దాని గొప్పతనాన్ని ఎల్లపుడు తెలుపుతూ ..... ఓ పదకొండేళ్ళ అమ్మాయి బస్తి నుండి వచ్చి వేసవి ,సెలవులుకి ,మొత్తం పరివారంతో ప్రతి ఉదయం , సాయంత్రం గెంతుతూ స్నానం చేసేవారు ,ఆ రెండు నెలలు నాకు చాలా అపురూపంగా అనిపించేది ..... అలా ఓ ఐదేళ్ళు వరసగా జరిగాక ..ఇంక నాకు వాళ్ళు కనిపించలేదు ...తెల్లవారుతూ ,రాత్రిఅవుతూ ,నిస్తేజంగా సాగుతూ ఉన్న జీవితాలు ,ఎందుకిలా అయిపోయాయి....... ఓ రోజు తెల్లవారి మళ్లి ఆ అమ్మాయి.. కాదు, కాదు ,ఆమె పెద్దామె అయిపోయింది....ఆ మొహం లో ఆనందం లేదు ...కానీ పండగ పుట గోదాకళ్యాణం జరుగుతున్న శుభవేళ ఆమె, ఆమె తమ్ముడు వచ్చి నన్ను చూస్తూ అమ్మవారి గుడిలో కూచుని ప్రార్ధిస్తూ .... ఈ ఊరు, నా చిన్న తనం , ఏ బాద్యత ఎరగని అల్లరితనం ....జీవితంలో సంధ్య సమయం ఆ ఊరు , పైరు ,పంట ,పొలాలు ,పురోగతి లేకుండా ఏమిటిది బావ అని అన్నపుడు ..నాకు జీవచవంలా మారిపోయరెంటా అన్న పదానికి సమాధానం దొరికినట్లు ..... ఒకప్పటి విలువులు లెవు, పరివారాభివృద్ధి అన్న ఆలోచన లేని మనిషీ, ప్రకృతిని ద్వంశం చేస్తూ పోతున్నాడు...... నేను దాని లో భాగంగా .....కాల ప్రవాహం లో ....

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (2)