English
Download App from store
author
kavi Ramya
I enjoy reading and writing. My favorite genres are Children, Comedy, Drama, Fantasy, Fiction, Inspiration, Love, Mythology, Romance, Spiritual, Thriller. I have been a part of the Kahaniya community since October 7, 2020.
user
kavi Ramya
రాబోయే కాలం!
కాల్పనిక కాలం!
  15 Views
 
  3 Mins Read
 
  0

"వెల్కమ్ టూ 2070! రండి" అంటూ చిట్టి ద రోబో దాని భాషలో స్వాగతం పలుకగా "ఏమే! చెప్పిన పనులు చేసావా? లేకపోతే నిన్ను ఛార్జ్ చేయను... బ్యాటరీ 'లో' అని కొట్టుకు ఛస్తావు, జాగ్రత్త!" అంటూ నసిగాడు సుందర్. "ఎస్ బాస్! మీరు చెప్పిన పనులన్నీ చేసేసాను" అంటూ చిట్టి పలుకగా "సరే! న్యూ ఇయర్ పార్టీ ఏర్పాట్లు చూసుకో..మా వాళ్ళు వస్తూ ఉండుంటారు... కానీ...నీ లేడీ బాస్ ఎక్కడ?" అని సుందర్ అడగగా "వర్చ్యువల్ క్లాస్(ఆన్లైన్ క్లాస్) తీసుకుంటున్నారు మేకప్ ఎలా వేసుకోవాలి అని.." అంది చిట్టి "హ్మ్మ్...తమరు వచ్చినప్పుడు నుండి క్లాసులు తీసుకుంటూనే వుంటోంది.. అసలు నిన్ను ఎవరు సాయం చేయమంది? ఇంతకుముందు వంట అయినా చేసేది..నీకు నేర్పించి తన టైమ్ పాస్ తను చూసుకుంటోంది... బద్ధకం కిలో లెక్కన పెంచుతోంది" అంటూ తిట్టడం మొదలెట్టాడు సుందర్.. "ఏవండి... ఇదేనా రావడం" అంటూ వాళ్ళ ఆవిడ రాధికా రాగానే "అవును బేబి... ఏం చేస్తున్నావు రా" అని ప్రేమగా ప్లేటు ఫిరాయించాడు "ఒక్క నిమిషం... చిట్టీ ఈయన ఇప్పటిదాకా ఏం అన్నారో నాకు చెప్పు" అని అంది తెలివైన రాధికా చిట్టి మొత్తమంతా కళ్ళకి కట్టినట్టు తన కళ్లనుండి వచ్చిన లేసర్ లైట్ తో స్క్రీన్ మీద చూపించింది... "చచ్చానురోయి... ఇది మొత్తం సీనులు చూపించేసింది... ఇప్పుడు ఎలా?" అని టెన్షన్ లో పడిపోయాడు సుందర్.. రాధికాకి కోపం టూ ద పవర్ ఆఫ్ టెన్ కి మారగా.... "మమ్మీ!" అంటూ ఆన్లైన్లోకి వచ్చాడు వాళ్ళ అబ్బాయి రెం... అదేం పేరు అనుకునేరు...అది కంప్యూటర్ లో ఒక భాగం పేరు... వీళ్ళ టెక్నాలజీ పిచ్చితో వాడి పేరు అలానే పెట్టి చచ్చారు...రెం అంటే RAM రాండమ్ యాక్సిస్ మేమోరీ... "ఏంటి నానా?" అని వాళ్ళ అమ్మ అడగగా "అమ్మా! స్టాప్ ఫైటింగ్( కొట్టుకోవడం ఆపండి).. నాకు ఇప్పుడు వాటర్ కావాలి...సెండ్ మీ(పంపు)...నేను ఇక్కడ క్లాసులతో బిజీగా ఉన్నా" అంటూ కాల్ కట్ చేసాడు.. చిట్టి రోబో కోపాన్ని సెంటిమెంట్ అనాలిసిస్ చేసి ఎంత కోపంగా ఉన్నాడో  ఎర్ర ప్రమాద స్థాయి మీటర్లో చూపించింది... "అమ్మో" అనుకుని వాళ్ళ అమ్మ రాధిక పరుగున వెళ్ళి ఒక క్యాప్సూల్ చిట్టీ చేతిలో పెట్టి ఇచ్చి రమ్మంది రెం కి.. వాటర్ క్యాప్సూల్ అది(నీళ్ళు తాగినట్టు అనిపించే టాబ్లెట్).. అంతే కదా పోనూ పోనూ నీళ్ళు కరువవుతాయి అంటే ఇదేనేమో... "సరే...ఇవాళ్టి న్యూ ఇయర్ పార్టీ ఏర్పాట్లు చేసేసావా... ఐ మీన్ అందరిని పిలవడం..." అన్నాడు సుందర్ "ఎస్...అందరికి మెసేజ్ విత్ వీడియో పెట్టేసా" అంటూ గర్వంగా చెప్పింది రాధికా ******** పార్టీ టైం... "ఎస్ ప్లీస్ రండి..." అంటూ వచ్చిన వారికి స్వాగతం పలికారు రాధికా సుందర్ రాని కొంతమంది ఆన్లైన్లో నుండే విషెస్ చెప్పి వెయిట్ చేస్తున్నారు పార్టీ స్టార్ట్ అవ్వడానికి... "సారీ..మా స్పేస్ షటిల్ కాస్త లేటుగా వచ్చింది...దారిలో ఆకాశంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది..." అంటూ ఒకతను చెప్పాడు "పర్లేదండి... ప్లీస్ కం ఇన్" అంటూ పార్టీ లో పిలిచి పార్టీ స్టార్ట్ పెట్టారు.. అందరూ క్యాప్సూల్ లు మింగి బ్యావ్ మని తేన్పులు కానించి బాయ్ లు చెప్పుకోగా "హాయ్ గ్రానీ!" అంటూ రెం ఆనందంగా స్వాగతం చెప్పాడు వాళ్ళ నానమ్మకి "ఎలా వున్నావు రా బంగారం?" అంటూ హగ్గులు ఇచ్చి ముద్దాడింది.. "బాగున్నాను...గ్రానీ... కం ఫుడ్ తిని నీ కాలంలో ఎలా జరుపుకునేవారో చెప్పు" అంటూ వాళ్ళ బామ్మ కథల కోసం ఆరాట పడ్డాడు రెం "ఆ...అలాగే! మా తరం వారు పార్టీలు ఎక్కువగా జరుపుకునే వారు కాదు...కరోనా దెబ్బకి ఎక్కడి వారు అక్కడే గప్ చుప్...కరోనా పూర్తిగా తగ్గాక జనాలు పార్టీలకి కూడా చాలా శుచి శుభ్రంగా వెళ్లి మొదలు సానిటీజర్తో చేతులు కడుక్కోని ఆ తరువాత లోపలికి వచ్చేవారు..ప్రేమ గా పలకరీంచడమే మరిచిపోయారు... అందరూ వాళ్ళ బిజిలో వాళ్ళు...పాపం కరోనా మమ్మల్ని ఆర్ధికంగా చాలా కుంగ తీసింది... అందరు చెల్లా చెదురైపోయారు.. మిగిలిన వారు ఎలా జీవితం సాగించాలో అనే తికమకలో పడి పనిలో వారి టెన్షన్ ని మరిచిపోయే ప్రయత్నం చేసారు..వ్యవసాయాం కరువైంది... ఆత్మీయులు ఆన్లైన్లో దొరకడం అలవాటుగా మారింది... ఎవరూ అవతలవారి కష్టాలు చూడలేకపోయారు...ఎవరికి వారే...వారి కష్టాలు పెద్దవిగా మారాయి వారికి" అంటూ బాధగా చెప్పింది గ్రానీ "హ్మ్మ్...పోనీలే ఇప్పుడు అది మీ తరంతో ఆగింది...మా తరంలో మళ్ళి రాకపోకలు...ఆత్మీయుల పలకరింపులు, ప్రతీ దానిలో ఆవిష్కరణ.. ప్రగతితో పాటు ఇంటి సభ్యుల అనురాగాలు..పిల్లల బిజీ క్లాసులతో పాటు నేర్చుకునే సంస్కారం, సంస్కృతి... ఇలా అన్నీ మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి... కానీ స్టయిల్ కొంచెం మారింది అంతే...ఏమంటావు అమ్మా?" అంటూ సుందర్ అనగా "అవును రా..కానీ చేతులతో పట్టేడు అన్నం తినలేము... గ్లాసు తో నీళ్లు లేవు...లక్కీగా మీరు మీ ఇంటి వెనకాల తెచ్చి టిష్యూ కల్చర్ లో ఒక పద్ధతి చేయడంతో కాస్త కూరలు, అన్నం చూడగలుగుతున్నాం..లేదా అన్నీ టాబ్లెటలే...కర్మ..కర్మ...అవి వచ్చేవి ఎవరింటికి వాళ్ళకే సరిపోతాయి...కాస్త పెద్ద కుటుంబం అయితే వాటికి కూడా టాబ్లేటులు గతి...ఏంటో పండగకి బంతి భోజనం పెట్టిన వంశం మనది..ఇప్పుడు పార్టీలు లో బిళ్ళలు(టాబ్లెట్స్) పంచే వంశంగా మారింది" అంటూ వాపోయింది వాళ్ళ అమ్మ "ఇట్స్ ఓకే గ్రానీ... ఏం చేయగలం...వదిలేయ్.. మీ వాళ్ళు గనుక ప్రకృతిలో ఉన్నవాటిని పాడు చేయకుండా బాధ్యత గా ఉండుంటే ఈ రోజు మేము కూడా నీళ్లు గ్లాసులో, గిన్నెలలో పంచభక్ష పరమాన్నాలు వండుకుని తినేవాళ్ళం.. ప్రకృతి వడిలో ఆడుకునేవాళ్ళం గ్రానీ" అంటూ రెం చెప్పగా "అంతే నానా... కొంతమంది వినకుండా చేసిన దానికి మీరందరూ ఫలితాలు అనుభవిస్తున్నారు..సారీ..." అంటూ గ్రానీ బాధపడగా "ఇట్స్ ఒకే గ్రానీ...అయిపోయింది.. ఏమి చేయలేము...లెట్ అస్ థాంక్ వున్నదానికి.." అంటూ రెం హగ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లి వాళ్ళ గార్డెన్లో కూర్చున్నారు ఇద్దరూ.. దూరం నుండి సుందర్ రాధికా మౌనంగా చూస్తూ వారి పాత తరాల గురించి ఆలోచిస్తూ బాధ పడ్డారు..చిట్టీ వారికి జ్యూస్ క్యాప్సూల్ ఇచ్చి "బాధపడద్దు" అంటూ ధైర్యం చెప్పింది వాళ్ళ ఫీలింగులు అర్ధం చేసుకుని కృతిమ ఇంటెలిజెన్స్ సహాయంతో ********* హ్మ్మ్...ప్రకృతి మన భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం..దాన్ని పాడు చేస్తే అన్ని విధాలా నష్టపోయేది మానవుడే...

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

( )star-unfilled( )star-unfilled( )star-unfilled( )star-unfilled( )star-unfilled
Comments (0)