English
Download App from store
author
Dr Koti kaapuganti
I write Prose in telugu. My work is in Crime, Drama, Fantasy genres. I have been a part of the Kahaniya community since September 2, 2020.
episodes
1
Episode:
bookmark-unselected
2
Episode:2
bookmark-unselected
3
Episode:3
bookmark-unselected
4
Episode:4
bookmark-unselected
author
Dr Koti kaapuganti
నలుగు గోడల మద్య లో నేను
corona
26 views
0 reviews

ఏ క్ష‌ణాన చైనాలోని వూహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్‌ను గుర్తించారో ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌పంచానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్ర‌పంచ దేశాలు ఈ మ‌హ‌మ్మారి దాటికి త‌ట్టుకోలేకపోతున్నాయి. రోజుకో కొత్త వేరియెంట్‌తో అగ్ర‌దేశాల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడిస్తోందీ వైర‌స్. ఇక ఇప్పుడిప్పుడే క‌రోనా తీవ్ర‌త త‌గ్గుతోంద‌ని సంతోషిస్తున్న వేళ మ‌రో కొత్త వేరియంట్ భ‌య‌పెట్టిస్తోంది. తాజాగా ప‌రిశోధకులు వియ‌త్నంలో కొత్త‌గా హైబ్రిడ్ క‌రోనా వైర‌స్‌ను గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ గ‌త వేరియంట్‌ల‌ను మించి విస్త‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా మొద‌ట వ‌చ్చిన వైర‌స్‌ల‌తో పోల్చితే మార్పు చెందిన వేరియెంట్లు మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి ఇప్పుడు అ‍త్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్‌ పుట్టుకొచ్చింది. భార‌త్‌, బ్రిట‌న్‌ల‌లో క‌రోనా ఉగ్ర‌రూపానికి కార‌ణ‌మైన మ్యూటెంట్ల ల‌క్ష‌ణాల‌తో ఈ కొత్త హైబ్రిడ్ వైర‌స్ పుట్టుకొచ్చిన‌ట్లు వియ‌త్నాం హెల్త్‌ మినిష్టర్‌ న్యూయెన్‌ థాన్‌ ప్రకటించారు. ఇప్ప‌టికే దేశంలోని ప‌లున‌గ‌రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు న‌మోదైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈ హైబ్రిడ్‌వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఈ కొత్త మ్యుటెంట్ మ‌ళ్లీ ప్ర‌పంచానికి ఎలాంటి స‌వాల్ విసురుతుందో చూడాలి.

© All rights reserved
Reviews (0)